Pathaan Movie Trailer: హాలీవుడ్ లెవెల్లో.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో - అదరగొట్టిన `పఠాన్` ట్రైలర్..!
Pathaan Movie Trailer: ఇక ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఉత్సుకతగా ఎదురుచూడటం తథ్యం.

వరుస పరాజయాలను చవిచూసిన షారూఖ్ ఖాన్.. భారీ విజయమే లక్ష్యంగా తపస్సు చేసినట్టుగా శ్రమించిన చిత్రం `పఠాన్`. హాలీవుడ్ లెవెల్లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా ఆ చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. ఒక హాలీవుడ్ జేమ్స్‌బాండ్ చిత్రాన్నే రూపొందించినట్టుగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె.. కథానాయికగా నటించగా.. ఆమె కూడా ఓ పోలీస్ అధికారి అనే విషయం ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
ఇక విలన్ క్యారెక్టర్‌లో జాన్ అబ్రహాం అదరగొట్టాడు. షారూఖ్ ఖాన్‌కి, జాన్ అబ్రహాంకి మధ్య యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో ఉండటం గమనార్హం. హాలీవుడ్ స్థాయిలో మంచు కొండల్లో సాహసాలు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉందనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఉత్సుకతగా ఎదురుచూడటం తథ్యం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్‌లో ఓ డైలాగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అది.. `ఒక సైనికుడు తన కోసం దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు` అంటూ షారూఖ్ చెప్పిన డైలాగ్.