Shaakuntalam Release Trailer - విజువల్ ఫీస్ట్ గా శాకుంతలం ట్రయిలర్
Shaakuntalam Release Trailer - సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా శాకుంతలం. ఈ సినిమా నుంచి మరో ట్రయిలర్ రిలీజ్ అయింది.

సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా శాకుంతలం. సరిగ్గా విడుదలకు వారం రోజుల ముందు రిలీజ్ ట్రయిలర్ పేరిట మరో ట్రయిలర్ విడుదల చేశారు. ఈసారి సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు బయటపెట్టారు. కేవలం సినిమాలో గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా.. మంచి డైలాగ్స్, ఎమోషన్స్, ఫైట్స్ ఉన్నాయనే విషయాన్ని ట్రయిలర్ తో వెల్లడించారు.
మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథగా మనం చెప్పుకునే దుష్యంత, శకుంతల ప్రేమగాథను మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై గుణ శేఖర్ రూపొందించిన విజువల్ వండర్ ‘శాకుంతలం’. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందరూ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తిని మరో మెట్టుకి తీసుకెళ్లేలా విడుదలైంది తాజా రిలీజ్ ట్రైలర్.
శకుంతలగా సమంత అందం, అమాయకత్వం కలగలిపిన నటన, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ లుక్.. వారి మధ్య ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ ప్రయాణం ఎంతో అందంగా చూపించారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. దుర్వాస మహామునిగా మోహన్ బాబు.. చిన్ననాటి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది.