Malli Pelli - నరేష్ సినిమా టీజర్ వచ్చేస్తోంది!
Malli Pelli Movie - సీనియర్ నరేష్ హీరోగా నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమా టీజర్ రెడీ అయింది.

Naresh's Malli Pelli Movie: మళ్లీ పెళ్లి రిలీజ్ తర్వాత ఆటంబాంబ్ పేలుతుంది
సీనియర్ నరేష్ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
మేకర్స్ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇక టీజర్ ను ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నారు. నరేష్, విత్ర లోకేష్ అందమైన చిరునవ్వుతో లవ్ సింబల్స్ చూపిస్తూ కనిపించారు. నరేష్ సూట్ వేసుకోగా, పవిత్ర లోకేష్ చీరలో ఆకట్టుకున్నారు.
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ‘మళ్ళీ పెళ్లి’ సినిమా ఈ వేసవిలోనే విడుదల కానుంది.