Sekhar Kammula: 12 ఏళ్ల తర్వాత పొలిటికల్ మూవీ
Sekhar Kammula: 12 యేళ్ల తర్వాత ఓ పొలిటికల్ మూవీ చేస్తున్నాడు కమ్ముల. ఈ సారి ఓ స్కాం ను హైలైట్ చేస్తూ ధనుష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల, పొలిటికల్ మూవీస్ కూడా తీయగలడు. అయితే అవి కూడా అతడి స్టయిల్ లోనే సెన్సిబుల్ గా ఉంటాయి. లీడర్ సినిమా దీనికి సరైన ఎగ్జాంపుల్. రానాను హీరోగా పరిచయం చేసిన ఆ సినిమా ఓ పొలిటికల్ సబ్జెక్ట్. కానీ అంతా ఊహించినట్టు ఉండదు, సాఫ్ట్ గా ఉంటుంది.
మళ్లీ ఇన్నేళ్లకు, ఇంకా చెప్పాలంటే పుష్కరం తర్వాత కమ్ముల మరోసారి పొలిటికల్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. ధనుష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ సినిమా ఓ స్కామ్ చుట్టూ తిరుగుతుంది. గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ కథ రాసుకున్నాడు శేఖర్ కమ్ముల. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.
నిజానికి లవ్ స్టోరీ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి. ధనుష్ ఓకే చెప్పేశాడు కూడా. కాకపోతే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు కమ్ముల. అందుకే ఈ గ్యాప్ లో వెంకీ అట్లూరి సినిమా పూర్తిచేశాడు ధనుష్. ఇప్పుడు పూర్తిస్థాయిలో కమ్ముల సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.