Sekhar Kammula | గొప్పగా ఉందంటున్న కమ్ముల
Sekhar Kammula - దర్శకుడిగా 24 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. 25వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడాడు కమ్ముల.
నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల. 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే ఓ బ్రాండ్. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ఏట అడుగుపెట్టారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.
"సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు, చెడు చెప్పకూడదు అనే ఫార్మెట్ లో పోతాను. నెగిటివ్ సంఘటనల్ని కూడా చాలా బెటర్ గా చూపించవచ్చు అనిపిస్తుంది. నేను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు. అలా అని సినిమాలూ తీయలేదు. అదే నాకు గర్వంగా ఉంది."
ఇలా తన స్టయిల్ ను బయటపెట్టాడు కమ్ముల. ప్రస్తుతం సినిమా రంగం చాలా రకాలుగా మారిపోయిందన్న కమ్ముల... ఎవరి మారిపోయినా, ఎన్ని మార్పులొచ్చినా తను మాత్రం తను నమ్మిన సిద్ధాంతాలకు తగ్గట్టు సినిమాలు చేస్తానంటున్నారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు కుబేర అనే మూవీ చేస్తున్నాడు. నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాతో ఓ సరికొత్త పాయింట్ ను చెప్పబోతున్నానని ప్రకటించాడు.