Telugu Global
Cinema & Entertainment

మరో కీలక పాత్రలో సత్యరాజ్

సత్యదేవ్ సినిమాలోకి సత్యరాజ్ ఎంటరయ్యారు. ఇద్దరు విలక్షణ నటులు ఒకే తెరపై కనిపించబోతున్నారు.

మరో కీలక పాత్రలో సత్యరాజ్
X

హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాలసుందరం, దినేష్ సుందరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సీనియర్ నటుడు సత్యరాజ్ ఇప్పుడీ ప్రాజెక్టులోకి ఎంటరయ్యారు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం ఈయన్ను తీసుకున్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే డిసైడ్ చేస్తారు.

సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. ఇలాంటి ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న ప్రాజెక్టు కావడంతో సహజంగానే సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

First Published:  26 Oct 2022 8:37 PM IST
Next Story