Telugu Global
Cinema & Entertainment

SatyaDev Zebra - జీబ్రా మూవీ షూటింగ్ అప్ డేట్స్

SatyaDev's Zebra Movie - సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం జీబ్రా. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి ఎంటరైంది.

SatyaDev Zebra - జీబ్రా మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'జీబ్రా. ధైర్యవంతుల్నే అదృష్టం వరిస్తుందనే అర్థంవచ్చేలా ట్యాగ్ లైన్ పెట్టారు.

పద్మజ ఫిలింస్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో, ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సత్య, సునీల్ ఇతర ముఖ్య తారాగణం.

ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఆర్థిక నేరాల నేపథ్యంలో యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో జరిగిన ప్రతి కీలక సన్నివేశం, దేశంలో ఎక్కడో ఒక చోట జరిగినవే కావడం విశేషం.

ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు.

First Published:  13 May 2023 1:15 PM IST
Next Story