Gurthunda Seethakalam: సత్యదేవ్ సినిమా వాష్ అవుట్
Gurthunda Seethakalam: సత్యదేవ్ కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం డిజాస్టర్ అయింది.

తన కెరీర్ లో మరో ఫ్లాప్ అందుకున్నాడు సత్యదేవ్. ఈసారి తమన్న ఫ్యాక్టర్ కూడా అతడికి కలిసిరాలేదు. రీమేక్ అనే సెంటిమెంట్ కూడా వర్కవుట్ కాలేదు. అదే గుర్తుందా శీతాకాలం.
కన్నడలో హిట్టయిన లవ్ మాక్ టెయిల్ కు రీమేక్ గా వచ్చింది గుర్తుందా శీతాకాలం. తమన్న హీరోయిన్ గా నటించింది. తొలిసారి సత్య సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు.
ట్రేడ్ ప్రకారం, గుర్తుందా శీతాకాలం సినిమాను కోటి 72 లక్షల రూపాయలకు అమ్మారు. సో.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2 కోట్ల రూపాయల షేర్ రావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 39 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అంటే బయ్యర్స్ కోటిన్నరకు పైగా లాస్ అన్నమాట.
దీంతో ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే సత్యదేవ్ కు ఓటిటిలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి నిర్మాత అక్కడ ఎంతోకొంత రికవరీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాను గంపగుత్తగా మ్యాంగో రామ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అతడు బయటపడాలంటే నాన్-థియేట్రికల్ ఒక్కటే దిక్కు.