Santhosh Shoban | రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా
Santhosh Shoban - పెళ్లి చేసుకోనంటున్నాడు సంతోష్ శోభన్. చేసుకోవాల్సి వస్తే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటాడట.
హీరోలు గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. లేదంటే సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు. ఇలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. సింపుల్ గా పెళ్లి చేసుకున్న నితిన్, నిఖిల్ లాంటి హీరోలు కూడా ఉన్నారు. కానీ సంతోష్ శోభన్ మాత్రం మూడో రకం. ఈ హీరో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు.
" పెళ్లి మీద ఆసక్తి లేదు. ఇంట్లో వాళ్లు కూడా అడగడం మానేశారు. నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని మాత్రమే ఇంట్లో అడుగుతున్నారు. ఇప్పటికైతే ఆ ఆలోచన అస్సలు లేదు. పెళ్లి బట్టలు చూస్తుంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. పెళ్లి తతంగం వద్దనిపిస్తుంది. చేసుకుంటే రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటానేమో."
ఇలా పెళ్లిపై తన అనాసక్తిని బయటపెట్టాడు సంతోష్ శోభన్. ప్రేమ్ కల్యాణ్ సినిమాతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు ఈ హీరో. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ ప్రేమ్ కల్యాణ్ తో పాటు, అతడు నటించిన సినిమాల్లో పెళ్లి ప్రధాన ఇతివృత్తం. కానీ నిజ జీవితంలో మాత్రం పెళ్లిపై విరక్తి వచ్చేసింది ఈ హీరోకి.
త్వరలోనే యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై సినిమాలు చేయబోతున్నాడు ఈ హీరో. వాటి వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకు రాబోతున్నాయి.