Telugu Global
Cinema & Entertainment

Pushpa 2: సంక్రాంతికి పుష్పరాజ్ స్పెషల్

Pushpa 2 Movie: పడుతూ లేస్తూ సాగుతున్న పుష్ప-2 నుంచి సాలిడ్ అప్ డేట్ రెడీ అయింది. సంక్రాంతికి స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తున్నారు.

Pushpa 2: సంక్రాంతికి పుష్పరాజ్ స్పెషల్
X

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప-2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో బన్నీ-సుకుమార్ కలిసి మరోసారి పార్ట్-2 స్క్రిప్ట్ పై కూర్చున్నారు. అలా పార్ట్-2 షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.

ప్రాక్టికల్ గా చూసుకుంటే, ఈపాటికి పుష్ప-2 షూటింగ్ పూర్తయి, థియేటర్లలోకి కూడా వచ్చేయాలి. కానీ ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. ఓవైపు షూటింగ్ చేస్తున్నప్పటికీ ఆ విషయాలు కూడా చెప్పడం లేదు.

ఈ మొత్తం సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది పుష్ప యూనిట్. సంక్రాంతికి పుష్ప-2 నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఆ వీడియోలో షూటింగ్ అప్ డేట్స్ తో పాటు, వీలైతే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ ఏడాదిలోనే పుష్ప-2 సినిమా థియేటర్లలోకి వస్తుంది.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ, స్పెషల్ సాంగ్ చేయబోతోంది.

First Published:  6 Jan 2023 2:00 PM IST
Next Story