సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించా
సినిమావాళ్లు ఎవరూ పరామర్శించలేదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగపతిబాబు క్లారిటీ
BY Raju Asari22 Dec 2024 5:26 PM IST
X
Raju Asari Updated On: 22 Dec 2024 5:26 PM IST
సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి.. బాధిత కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించలేదంటూ విమర్శలు వస్తున్న విషయం విదితమే. దానిపై జగపతి బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.
సినిమా షూటింగ్ ముగించుకుని నేను ఊరి నుంచి రాగానే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హాస్పిటల్‌కు వెళ్లాను. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లాను. అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దానిపై స్పష్టత ఇవ్వడానికే ఈ పోస్టు అని తెలిపారు.
Next Story