Telugu Global
Cinema & Entertainment

Sandeep Madhav | క్యాథరీన్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు

Sandeep Madhav - సందీప్ మాధవ్ పోలీసాఫీసర్ గా కొత్త సినిమా మొదలైంది. క్యాథరీన్ ఇందులో హీరోయిన్.

Sandeep Madhav | క్యాథరీన్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు
X

ఓదెల రైల్వే స్టేషన్ చిత్ర దర్శకుడు అశోక్ తేజ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. పాపులర్ హీరోయిన్ కేథరిన్, జార్జిరెడ్డి, వంగవీటి చిత్రాల హీరో సందీప్ మాధవ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది ఈ సినిమా.

హీరో, హీరోయిన్లలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది క్లాప్ నివ్వగా, నిర్మాత సి.కల్యాణ్ స్వీచ్చాన్ చేశారు. ప్రసన్నకుమార్, జెమిని కిరణ్‌లు గౌరవ దర్శకత్వం వహించారు.

జార్జిరెడ్డి తరువాత ఎన్నో కథలు విన్న సందీప్ ఈ కథ వినగానే ఓకే చేశాడు. ఓదెల రైల్వేస్టేషన్‌కు పది రెట్లు అద్భుతంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు అశోక్.

ఇక హీరోయిన్ కేథరిన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఆమెకు నచ్చిందంట. పైగా సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ అంటోంది. అందుకే నటించడానికి అంగీకరించానని చెబుతోంది. సినిమాలో ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరంటోంది.

ఇంకా పేరు పెట్టని ఈ మూవీలో పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు సందీప్ మాధవ్. జార్జిరెడ్డి తర్వాత తనకు ఆ స్థాయిలో గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నాడు ఈ హీరో. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  27 July 2023 10:15 PM IST
Next Story