Yashoda Movie Trailer Review: యశోద ట్రయిలర్ ఎలా ఉందంటే..?
Yashoda Movie Trailer Review: సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా యశోద. మొన్నటివరకు ఈ సినిమా స్టోరీలైన్ సస్పెన్స్. తాజాగా ట్రయిలర్ లాంచ్ అయింది, సస్పెన్స్ వీడింది.

Yashoda Movie Trailer Review: సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా యశోద. ఈ సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఎవ్వరికీ ఏం అర్థంకాలేదు. తాజాగా ట్రయిలర్ రిలీజ్ అయింది. దీంతో యశోద సినిమా స్టోరీలైన్ ఏంటి, సమంత పాత్ర ఏంటనే విషయంపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది.
'యశోద' ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే...
'యశోద' టీజర్‌లో సమంతను గర్భవతిగా చూపించారు. ట్రైలర్‌లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే 'యశోద'ది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం... ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు.
సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు.
'నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది' అని సమంత చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. సమంతకు, డాక్టర్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ ఉందని హింట్ కూడా ఇచ్చారు. అంతే కాదు... 'యశోద'లో క్రైమ్ ఉంది, రాజకీయం ఉంది, అన్నిటి కంటే ముఖ్యంగా మహిళ చేసే పోరాటం ఉంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.