Shaakuntalam Movie Release Date: శాకుంతలం కొత్త విడుదల తేదీ
Samantha's Shaakuntalam Movie Release Date: ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన శాకుంతలం సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు కొత్త విడుదల తేదీ లాక్ అయింది.

Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ
శకుంతలగా బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత ..దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తోన్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ ఎట్రాక్ట్ చేశాయి.
శాకుంతలం చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం కోసం.. బుడాపెస్ట్, హంగేరికి చెందిన సింఫనీ టెక్నీషియన్స్ తో రీ రికార్డింగ్ వర్క్ చేశారు.
సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన శాకుంతలం చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది.