Telugu Global
Cinema & Entertainment

Samantha - సమంత కెరీర్ లో గ్యాప్

Samantha | కెరీర్ లో గ్యాప్ తీసుకోవడానికి సమంత ఫిక్స్ అయింది. మొన్నటివరకు ఇది పుకారు. ఇప్పుడు అదే నిజమైంది.

Samantha - సమంత కెరీర్ లో గ్యాప్
X

సమంత గ్యాప్ తీసుకుంటోందట. ఏడాది పాటు ఆమె సినిమాలు చేయదంట. అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటుందట. పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి మళ్లీ సినిమాల్లోకి వస్తుందట. మొన్నటివరకు సమంతపై జరిగిన ప్రచారం ఇది. ఇప్పుడీ ప్రచారం నిజమే అనిపిస్తోంది. సమంత వ్యవహారశైలి అలానే ఉంది.

మొన్నటికిమొన్న ఖుషి సినిమా పూర్తి చేసింది సమంత. కారవాన్ ఫొటోను పోస్ట్ చేసి, ఇకపై ఈ కారవాన్ లైఫ్ కు దూరం అనే విధంగా స్పందించింది. తాజాగా సిటాడెల్ షూటింగ్ పూర్తిచేసింది. ఈసారి కూడా పోస్ట్ పెట్టింది. షూటింగ్ పూర్తయిందని, తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పుకొచ్చింది.

ఈమె పోస్టులు చూస్తుంటే, ఆమె నిజంగానే కెరీర్ కు గ్యాప్ ఇచ్చేలా ఉందంటున్నారు నెటిజన్లు. వీటికి మరింత బలం చేకూరుస్తూ, ఆమె కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు అంగీకరించలేదు. కనీసం యాడ్స్ కు కూడా సైన్ చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఖుషి సినిమా, సిటాడెల్ డబ్బింగ్ పనులు పూర్తిచేసి ఆమె అమెరికా వెళ్లిపోతుందట. పూర్తిస్థాయిలో కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియాకు వస్తుందట. ఆ తర్వాతే మళ్లీ ప్రాజెక్టులు ప్రారంభిస్తుంది.

First Published:  15 July 2023 10:11 AM IST
Next Story