Telugu Global
Cinema & Entertainment

Samantha: ఫైట్స్ చేస్తే ఉల్లాసంగా ఉంటుంది

ఫైట్స్ చేసినప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుందని చెబుతోంది సమంత. యశోద మూవీలో ఆమె ఫైట్స్ చేసింది

Samantha: ఫైట్స్ చేస్తే ఉల్లాసంగా ఉంటుంది
X

హీరోయిన్లు పాటల్లో డాన్స్ మాత్రమే చేస్తారు. ఫైట్స్ చేసే హీరోయిన్లు చాలా తక్కువమంది. సమంత మాత్రం ఫైట్స్ చేస్తుంది. యూటర్న్ నుంచే తన కెరీర్ ను యూటర్న్ తిప్పిన ఈ బ్యూటీ, ఫ్యామిలీ మేన్ సిరీస్ తో నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంది. ఆ సిరీస్ లో తొలిసారి యాక్షన్ చేసిన సమంత, ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ కోసం మరోసారి ఫైట్స్ చేసింది. ఇలా యాక్షన్ చేసినప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుందని అంటోంది శామ్.


"కథలు వినేటప్పుడు గానీ... తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో గానీ... ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. 'యశోద' కంటే ముందు 'యు - టర్న్' చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, 'యశోద' చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే... యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను."


ఇలా యాక్షన్ అంటే తనకు ఎంతిష్టమో చెప్పుకొచ్చింది సమంత. యశోద సినిమాలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఏకంగా ఫారిన్ స్టంట్ మాస్టర్ ను తీసుకున్నారు. అతడు కంపోజ్ చేసిన ఫైట్స్, సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతోంది సమంత. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ.

First Published:  9 Nov 2022 7:04 PM IST
Next Story