Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు సోషల్ మీడియాలోకి సమంత

సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది సమంత. అలా 2 నెలలుగా కనిపించకుండా పోయిన ఈ ముద్దుగుమ్మ, ఎట్టకేలకు వినాయక చవితి సందర్భంగా ఇనస్టాగ్రామ్ లోకి ఎంటరైంది. ఇంతకీ ఆమె పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా?

Koffee with karan samantha
X

చివరిసారి సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించిందో తెలుసా? దీనికి ఠక్కున ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఓవైపు హీరోయిన్లంతా ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తుంటే, సమంత మాత్రం పూర్తిగా సోషల్ మీడియాకు దూరమైంది. ఆమె ఎక్కడుంది, ఏం చేస్తోంది లాంటి అప్ డేట్స్ ఏవీ కనిపించడం లేదు.

ఆమె ఎందుకు సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించడం లేదనే విషయం కూడా చాలామందికి తెలుసు. ఎప్పటికప్పుడు ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. అభ్యంతరకర కామెంట్స్ తో కొంతమంది సమంతను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అందుకే ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది.

అలా 2 నెలలుగా సోషల్ మీడియాకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు మళ్లీ మెరిసింది. వినాయక చవితి సందర్భంగా ఇనస్టాగ్రామ్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తన కొత్త సినిమా అప్ డేట్ ను బయటపెట్టింది. ప్రస్తుతం ఈమె యశోద అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా టీజర్ ను మరో వారం రోజుల్లో విడుదల చేయబోతున్న విషయాన్ని వెల్లడించడం కోసం సోషల్ మీడియాలోకి వచ్చింది సమంత.

ఈ ముద్దుగుమ్మ వరస చూస్తుంటే, ఇకపై తన సినిమాల ప్రమోషన్లు, యాడ్స్ కోసం మాత్రమే సమంత సోషల్ మీడియాలో కనిపించేలా ఉంది. ఒకప్పట్లా ఫొటోషూట్లు, తన కుక్కపిల్లల వీడియోలు, జిమ్ లో కసరత్తులు ఇకపై కనిపించవేమో.

First Published:  1 Sept 2022 8:02 AM IST
Next Story