Salaar Box Office Collections: మొదటి వారాంతం దుమ్ముదులిపిన సలార్
Salaar Box Office Collections: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఫస్ట్ వీకెండ్ దుమ్ముదులిపింది. 3 రోజుల్లో 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

Salaar Box Office Collection : ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు సృష్టించింది. మరెన్నో రికార్డులు తుడిచిపెట్టింది.
డిసెంబర్ 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, ప్రీమియర్స్ నుంచే సత్తా చాటడం మొదలుపెట్టింది. రిలీజైన 3 రోజుల్లోనే ఓవర్సీస్ లో ఈ సినిమాకు 5.6 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి
ఇటు నైజాంలో ఈ సినిమా 48 కోట్ల రూపాయల షేర్ తో దూసుకుపోతోంది. అటు ఏపీలో కూడా సలార్ సినిమాకు కళ్లు చెదిరే వసూళ్లు వస్తున్నాయి. ఇక ఉత్తరాదిన మొదటి వారాంతంలో సలార్ సినిమాకు ఏకంగా 53 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.
క్రిస్మస్ సీజన్ పూర్తయ్యేసరికి ఉత్తరాదిన ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈరోజు లేదా రేపటికి 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తెలుగులో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సలార్ సినిమా. ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య మాత్రమే, ఈ ఏడాది పెద్ద హిట్ గా ఉండేది. ఇప్పుడీ రికార్డ్ ను సలార్ అధిగమించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఆల్ టైమ్ టాప్-3 హిట్స్ లో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.