ఆస్పత్రి నుంచిసైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్
సైఫ్‌పై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించిన పోలీసులు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన ఇంట్లోకి చొరబడి దుండగుడు కత్తితో దాడి చేయడగా నటుడికి గాయాలైన విషయం విదితమే. ఆరు రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్లు సైఫ్‌కు వారంరోజుల పాటు బెడ్‌రెస్ట్ సూచించారు. ఇన్ఫెక్షన్ చేరకుండా ఉండటానికి కొంతకాలం బైటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సైఫ్ ఇంటికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంట తల్లి, నటి షర్మిలా టాగూర్ ఉన్నారు. సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్, కుమార్తె సారా అలీఖాన్ తదితరులు ఆస్పత్రి నుంచి కొద్దిసేపటి కిందట ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కొందరు ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సైఫ్‌పై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించి కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.
మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల కిందటే మేఘాలయలోని డౌకీ నది గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఇక్కడి వచ్చాక విజయ్‌దాస్‌గా పేరు మార్చుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని వారాల పాటు ఉండి.. ఉద్యోగం వెతుక్కుంటూ ముంబాయికి చేరుకున్నాడు. ముంబయి రావడానికి కొన్ని రోజుల ముందు స్థానిక వ్యక్తి ఆధార్‌కార్డును ఉపయోగించి సిమ్ కార్డు తీసుకున్నాడు.
నిందితుడు ఉపయోగించిన సిమ్‌కార్డు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయింది. నిందితుడు కూడా భారత్‌లో ఉంటున్నట్లు ఆధార్ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాని పోలీసు అధికారి తెలిపార. అతని కాల్‌డేటాను పరిశీలించడగా బంగ్లాదేశ్‌క అతను అనేకసార్లు కాల్ చేసినట్లు గుర్తించారు. అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.