Telugu Global
Cinema & Entertainment

తెలుగు మాట్లాడ్డానికి సాయితేజ్ కారణమంట!

టాలీవుడ్ రైజింగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ చక్కగా తెలుగు మాట్లాడుకుంది. దీనికి కారణం సాయితేజ్ అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు మాట్లాడ్డానికి సాయితేజ్ కారణమంట!
X

పరభాషా హీరోయిన్లు రాజ్యమేలుతున్న టాలీవుడ్ లో తెలుగు నేర్చుకుంటున్న ముద్దుగుమ్మలు చాలా తక్కువమంది. నటించి, పారితోషికం తీసుకోవడానికే ఇష్టపడతారు తప్ప, తెలుగు నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు. ఈ విషయంలో హీరోయిన్ సంయుక్త మీనన్ చాలా డిఫరెంట్. ఆమె తెలుగు నేర్చుకున్న తర్వాతే సినిమాలు అంగీకరించడం మొదలుపెట్టింది. పైగా తను తెలుగు నేర్చుకోవడానికి కారణం సాయిధరమ్ తేజ్ అని చెబుతోంది.

"నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే కార‌ణం.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం కార‌ణ‌మ‌ని చెప్పాలి. సుకుమార్‌ స‌హా మంచి టెక్నీషియ‌న్స్ ఆ సినిమాలో భాగ‌మై ఉన్నారు. ఆ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్య‌త ఉంది. నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల్లో అదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్ప‌వ‌చ్చు."

తెలుగు నేర్చుకోవడం వెనక మరో కారణాన్ని కూడా బయటపెట్టింది సంయుక్త మీనన్. భాష తెలియకుండా నటిస్తే ఏదో వెలితిగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

"నేను చేసిన పాత్ర‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌ట‌మ‌నేది నాకు ఇష్టం లేదు. రేపు నా పాత్ర‌ను నేను స్క్రీన్‌పై చూసుకున్న‌ప్పుడు దాన్ని ఓన్ చేసుకోగ‌ల‌గాలి. భాష తెలియ‌కుండా న‌టిస్తే ఆ పాత్ర‌తో ఉన్న క‌నెక్ష‌న్‌లో యాబై శాతాన్ని కోల్పోతాన‌ని భావించాను. నా పాత్ర‌ల‌ను నేను అంతగా ప్రేమిస్తాను. అందుక‌నే నేను తెలుగు నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌నం తెలుగులో మాట్లాడిన‌ప్పుడు మ‌న‌తో ఇత‌ర యూనిట్ సభ్యుల‌కు తెలియ‌ని ఓ అనుబంధం ఏర్ప‌డుతుంది. ఆ విషయాన్ని నేను బ‌లంగా న‌మ్ముతాను."

ప్రత్యేకంగా ట్యూట‌ర్‌ని పెట్టుకుని లాక్ డౌన్ స‌మయంలో తెలుగు నేర్చుకుంది సంయుక్త మీనన్. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలకు సైన్ చేసింది. ప్రస్తుతం ధనుష్ సరసన సర్ అనే సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన బింబిసార సినిమా విడుదలకు సిద్ధమైంది.

First Published:  27 July 2022 9:01 AM IST
Next Story