Sai Pallavi | సాయిపల్లవి ఉంటే వర్క్ షాప్ చేయాల్సిందేనా..?
Sai Pallavi - మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటుంది సాయిపల్లవి. అంతేకాదు, ఆ పాత్రల కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించి, వర్క్ షాప్ లో కూడా పాల్గొంటుంది.
మంచి క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుంటుంది సాయిపల్లవి. ఆ పాత్రల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొంటుంది. ఇప్పుడు మరోసారి సాయిపల్లవి సినిమాకు వర్క్ షాప్ మొదలైంది.
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి కలిసి మరోసారి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వర్క్ షాప్ స్టార్ట్ చేశాడు దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా కోసం హీరోహీరోయిన్లతో పాటు, కీలకమైన టెక్నీషియన్లను ముందుగానే సిద్ధం చేయాలనుకుంటున్నాడు.
ఇందులో భాగంగా నాగచైతన్య ఆల్రెడీ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యాడు. ఓవైపు జిమ్ లో కసరత్తులు చేస్తూనే, మరోవైపు వర్క్ షాప్ కు హాజరవుతున్నాడు. శ్రీకాకుళం యాస నేర్చుకోవడంతో పాటు.. కొన్ని మేనరిజమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ వర్క్ షాప్ లోకి సాయిపల్లవి కూడా చేరబోతోంది.
యాదృచ్ఛికంగా సాయిపల్లవి నటించే ప్రతి సినిమాకు వర్క్ షాప్ జరుగుతోంది. ఇంతకుముందు నాగచైతన్యతో ఆమె చేసిన లవ్ స్టోరీ సినిమాతో పాటు.. విరాటపర్వం, ఫిదా సినిమాల కోసం కూడా వర్క్ షాపులో పాల్గొంది సాయిపల్లవి. ఇప్పుడు చందుమొండేటి సినిమాకు కూడా ఇదే రిపీటైంది.
డిసెంబర్ 9న ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న ఈ సినిమా నుంచి అప్ డేట్ ఇవ్వబోతున్నారు.