Samantha | సమంతపై పుకార్లు
Samantha Personal Life - సమంత వ్యక్తిగత జీవితంపై మరోసారి పుకార్లు చెలరేగుతున్నాయి. అయితే సమంత వీటిపై స్పందించలేదు.
భార్యాభర్తలుగా విడిపోయిన తర్వాత నాగచైతన్య, సమంత ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారు. కెరీర్ పరంగా కూడా నాగచైతన్య తన సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టగా.. సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. గడిచిన ఏడాదిన్నరగా మయొసైటిస్, దాని సైడ్ ఎఫెక్టులతో పోరాడుతోంది.
ఇక వ్యక్తిగత జీవితాల విషయానికొస్తే.. సినిమాలతో బిజీగా ఉంటూనే శోభిత ధూలిపాళ్లకు కనెక్ట్ అయ్యాడు నాగచైతన్య. 2022లో పరిచయమైన శోభితకు క్రమంగా దగ్గరయ్యాడు. అటు శోభిత కూడా నాగచైతన్య పట్ల ఎట్రాక్ట్ అయింది. అలా ఇద్దరూ 2023 నాటికి ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
మరి సమంత వ్యక్తిగత జీవితం సంగతేంటి? ఆమెపై పెద్దగా ఎలాంటి పుకార్లు లేవు. ప్రస్తుతానికి ఆమె సింగిల్. తాజాగా ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ పై పుకార్లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మేన్ దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడమూరుతో సమంత ప్రేమలో ఉందనేది బాలీవుడ్ మీడియా కథనం.
ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇటు సమంత, అటు రాజ్ ఎవ్వరూ స్పందించలేదు. రాజ్ డైరక్షన్ లో ఫ్యామిలీ మేన్ సీజన్-2 చేసింది సమంత. ఇక అతడి నేతృత్వంలో తాజాగా సిటాడెల్ సిరీస్ లో కూడా నటించింది.