Telugu Global
Cinema & Entertainment

NTR | ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

NTR, Prashanth Neel - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ నడుస్తున్నాయి. తాజాగా టైటిల్ పై కొత్త ప్రచారం మొదలైంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు గూస్‌బంప్స్‌ ఖాయం
X

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా. చాన్నాళ్లుగా మార్కెట్లో నలుగుతున్న ప్రాజెక్ట్ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు గతంలో రియాక్టర్ అనే పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆ టైటిల్ తమ దృష్టిలో లేదని స్వయంగా నీల్ ప్రకటించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో టైటిల్ తెరపైకొచ్చింది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇది ఎంతవరకు నిజం అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఎందుకంటే, మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఆ సందర్భంగా ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

ఆ రోజున ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే దేవర పార్ట్-1 నుంచి పాట రిలీజ్ చేయబోతున్నారు. దీనికి కారణం ప్రశాంత్ నీల్ సినిమానే అంటున్నారు. సరిగ్గా పుట్టినరోజు నాడు ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి భారీ అప్ డేట్ ఇవ్వాలనేది తారక్ ఆలోచనగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ నటుడు తన కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లాడు. పుట్టినరోజును అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాడు. తిరిగొచ్చి దేవర సినిమా షూట్ లో జాయిన్ అవుతాడు.

First Published:  18 May 2024 8:38 AM GMT
Next Story