Telugu Global
Cinema & Entertainment

Rudhrudu - లారెన్స్ సిగ్నేచర్ స్టెప్పులతో ఫస్ట్ సాంగ్

Rudhrudu movie - లారెన్స్ హీరోగా నటిస్తున్న రుద్రుడు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. లారెన్స్ డాన్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

Rudhrudu - లారెన్స్ సిగ్నేచర్ స్టెప్పులతో ఫస్ట్ సాంగ్
X

రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'రుద్రుడు'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నాడు. 'ఈవిల్ ఈజ్ నా బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రుద్రుడు ఫస్ట్ సింగల్ ‘‘ప్రాణాన పాటలే పాడుతుంది’ పాటని విడుదల చేశారు. తమిళ సూపర్ హిట్ వీర తిరుమగన్ చిత్రంలో‘‘పాడాద పాటెలం’ అనే క్లాసిక్ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేసి ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ గా ప్రజంట్ చేశారు.

ధరన్ కుమార్ ఈ పాటని ఎక్స్ ట్రార్డినరీగా రీక్రియేట్ చేయగా.. రాకేందు మౌళి ఈ పాటను తెలుగులో రాశాడు. ఈ పాటలో లారెన్స్ డ్యాన్స్ మెస్మరైజ్ చేసింది. లిరికల్ వీడియోలో కొన్ని సిగ్నేచర్ స్టెప్పుల్ని చూపించారు.

ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.



First Published:  12 Feb 2023 12:55 PM IST
Next Story