Rudhrudu Movie Trailer Review: రుద్రుడు థియేట్రికల్ ట్రయిలర్ రివ్యూ
Rudhrudu Movie Trailer Review: రుద్రుడు సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు లారెన్స్. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు.

నటుడు, డాన్స్ మాస్టర్, దర్శకుడు, రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శరత్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
రాఘవ లారెన్స్ కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్ ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్ కుమార్ తన జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలౌతాయి. అయినప్పటికీ, దృఢంగా నిలబడి, క్రిమినల్ ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు.
సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్, డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. రాఘవ లారెన్స్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతని డాన్స్ ఎప్పటిలాగే సూపర్బ్ గా ఉంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.