RRR Movie: గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్
RRR Movie: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఎంపికైంది ఆర్ఆర్ఆర్ మూవీ. 2 విభాగాల్లో ఈ అవార్డులకు నామినేట్ అయింది. ఇలా నామినేట్ అయిన తొలి తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్.

RRR Movie Japan box office collections
అంతర్జాతీయ సినిమాపై ఆర్ఆర్ఆర్ మెరుస్తోంది. ఇప్పటకే ప్రతిష్టాత్మక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఎంపికైన ఈ సినిమా, ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా మెరిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ లో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నాన్-ఇంగ్లిష్ చిత్రం విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. దీంతో పాటు ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు-నాటు సాంగ్ నామినేట్ అయింది. తాజా నామినేషన్లతో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు మరింత దగ్గరైనట్టయింది.
ఎందుకంటే, క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన సినిమాలే ఆస్కార్ లో కూడా మెరుస్తుంటాయి. అలా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్టయింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది.
ప్రస్తుతం జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. ముత్తు తర్వాత ఆ దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది ఆర్ఆర్ఆర్ మూవీ. సంప్రదాయ జపనీయులు తమ సినిమాలను మాత్రమే ఆదరిస్తారు. అలాంటిది ఆర్ఆర్ఆర్ సినిమా వాళ్లకు నచ్చిందంటే, అది పెద్ద విషయమే.