Telugu Global
Cinema & Entertainment

RP Patnaik - అహింసతో రీఎంట్రీ ఇవ్వడానికి కారణం చెప్పిన పట్నాయక్

RP Patnaik - కెరీర్ లో లాంగ్ గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు సంగీతం అందిస్తున్నారు. ఈ గ్యాప్ కు కారణం చెప్పుకొచ్చారు ఆర్పీ పట్నాయక్.

RP Patnaik - అహింసతో రీఎంట్రీ ఇవ్వడానికి కారణం చెప్పిన పట్నాయక్
X

ఆర్పీ పట్నాయక్.. సెన్సిబుల్ మ్యూజిక్ డైరక్టర్. ఇతడు తలుచుకుంటే ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేయొచ్చు. కానీ ఆర్పీ పట్నాయక్ మాత్రం గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు అహింసతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ గ్యాప్ లో పట్నాయక్ ఏం చేశారు?

"సినిమా ఉన్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పని చేస్తాను. కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే దర్శకత్వంకు సంబంధించిన కొన్ని కథలు రాస్తున్నాను. ఐతే నాకు మ్యూజిక్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక సందర్భంలో మానేశాను. ఐతే బాలు గారు నేను ఎక్కడ కనిపించినా మళ్ళీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ అని అడిగేవారు. అడిగిన ప్రతిసారీ ‘చేస్తాను గురువు గారు’ అని చెప్పేవాడిని. సమస్య ఏమిటంటే నాకు కథ నచ్చితేనే చేస్తాను. మధ్యలో చాలా వచ్చాయి. కానీ చేయాలనిపించలేదు. బాలు గారు వెళ్లిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చలేక పోయాననే గిల్ట్ ఎక్కువైపోయింది. బాలు గారు నాకు స్ఫూర్తి. ఆయన పాటపై ఉన్న అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయనకి ఇచ్చిన మాట తీర్చలేక పోయాననే బాధ ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకసారి తేజ ని కలిశాను. ‘మళ్ళీ మ్యూజిక్ చేయాలి. అది బాలు గారి కోరిక’ అని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత తేజ నుంచి ఫోన్ వచ్చింది. అదే అహింస మూవీ."

ఇలా తన రీఎంట్రీ వెనక కథను, గ్యాప్ లో చేసిన పనుల్ని చెప్పుకొచ్చారు ఆర్పీ పట్నాయక్. మ్యూజిక్ తో పాటు నటించాలని ఉందంటున్న ఈ సంగీత దర్శకుడు.. మంచి కథ దొరికితే వెబ్ సిరీస్ లో నటించాలనే కోరికను వ్యక్తం చేశారు. అహింస మ్యూజిక్ హిట్టవ్వడంతో.. తనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, కానీ చిన్న సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశారు ఆర్పీ పట్నాయక్.

First Published:  1 Jun 2023 8:41 AM IST
Next Story