Telugu Global
Cinema & Entertainment

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును స్వీకరించిన రిషబ్ శెట్టి

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం ఇవాళ ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును స్వీకరించిన రిషబ్ శెట్టి
X

కాంతారలో సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి విదితమే. తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఇవాళ ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో రాష్ట్రపతి సత్కరించారు. జాతీయ అవార్డు గ్రహీతలకు అభినందలు తెలిపారు. అనంతరం బెస్ట్‌ చైల్డ్‌ అవార్డు శ్రీపత్‌కు దక్కింది. తన బర్త్ డే రోజునే బెస్ట్‌ చైల్డ్‌ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. ఏఆర్‌ రెహమాన్‌కి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది అయితే, రెహమాన్‌కి ఏడో జాతీయ చలనచిత్ర పురస్కారం కావడం విశేషం.

పొన్నియన్‌ సెల్వన్‌ -1 చిత్రానికి బ్రహ్మాస్త్ర చిత్రానికి రజత కమలం అవార్డు, ఉత్తమ హిందీ చిత్రం గుల్‌మొహర్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా రాహుల్‌ వీ చిట్టెల అవార్డును అందుకున్నారు. అవార్డుల వేడుకలో గుల్‌మొహర్‌ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించగా.. అవార్డును నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.ఉత్తమ నటిగా నిత్యమేనన్‌ ’(తిరుచిత్రబలం), ఉత్తమ నటిగా మానసి ఫరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌) అవార్డులను అందుకున్నారు. ఉత్తమ తెలుగుచిత్రం (కార్తికేయ2) నుంచి దర్శకుడు చందూ ముండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ అందుకున్నారు. కోవిడ్ 19 కారణంగా అవార్డులు ఆలస్యమైన విషయం తెలిసిందే. మలయాళ చిత్రం అట్టం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది.

First Published:  8 Oct 2024 7:03 PM IST
Next Story