Telugu Global
Cinema & Entertainment

Richa Panai - గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది

Richa Panai - తను కావాలని గ్యాప్ తీసుకోలేదంటోంది హీరోయిన్ రిచా పనయ్. హిట్స్ లేకపోవడంతో గ్యాప్ వచ్చిందని ఓపెన్ గా చెబుతోంది.

Richa Panai - గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది
X

గ్యాప్ ఎందుకొచ్చింది.. ఈ ప్రశ్న అడిగితే హీరోయిన్లకు చాలా కోపం. అవకాశాలు రాలేదు కాబట్టి గ్యాప్ వచ్చిందని చెప్పలేరు. కాబట్టి రకరకాల సమాధానాలిచ్చి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. హీరోయిన్ రిచా పనయ్ మాత్రం అలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు.

హిట్స్ లేవు కాబట్టి తనకు అవకాశాలు రాలేదంటోంది. వచ్చిన 2-3 సినిమాల్ని వదలకుండా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తన ఆన్సర్ తో అందర్నీ ఆకట్టుకుంది.

"కెరీర్ లో గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. యముడికి మొగుడు, చందమామ కథలు, ఈడు గోల్ట్ ఎహె వంటి చిత్రాల్లో నటించాను. బృందావనమది అందరిదీ సినిమాలో నటించినా అది విడుదల కాలేదు. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను."

ఇలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసింది రిచా పవయ్. లాంగ్ గ్యాప్ తర్వాత సర్కిల్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. జులై 7న రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అయితే తనకు మరిన్ని ఛాన్సులు వస్తాయని, తేడా కొడితే మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తానని అంటోంది.

First Published:  25 Jun 2023 6:34 PM IST
Next Story