ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజు బాధ్యతలు
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రమాణం చేశారు.
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రమాణం చేశారు. ఇవాళ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల ఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజ్ అన్నారు. అయితే డిసెంబర్ 18న దిల్ రాజు పుట్టిన రోజు సందర్బంగా ఈ పదవిని చేపట్టడం విశేషం అని చెప్పుకోవాలి.
ఈ సందర్బంగా దిల్‌రాజుకు సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరీశ్ పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజును అభినందించారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన షూటింగ్స్ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని అన్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని అన్నారు.