Telugu Global
Cinema & Entertainment

నేను దురదృష్టవంతురాలినా? పవన్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్

భర్తతో విడాకులు తీసుకున్నందున తనను దురదృష్టవంతురాలిగా కొందరు పేర్కొనడం ఎంతో బాధ కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను దురదృష్టవంతురాలినా? పవన్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
X

భర్తతో విడాకులు తీసుకున్నందున తనను దురదృష్టవంతురాలిగా కొందరు పేర్కొనడం ఎంతో బాధ కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కొన్నేళ్ల కిందటే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరొక వివాహం చేసుకోగా.. రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి తరచూ అసభ్యకర కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే రేణు దేశాయ్ వాటిని తిప్పికొడుతూ వస్తున్నారు. కాగా, తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు రేణు దేశాయ్ ని ఉద్దేశించి ఇన్ స్టాలో చేసిన కామెంట్ కి ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు.

'అందంగా ఉండి.. మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్ లక్కీ' అని అభిమాని చేసిన కామెంట్ పై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను ఎలా అన్ లక్కీ అనేది ఒకసారి చెబుతారా? అని సదరు అభిమానిని రేణు ప్రశ్నించారు. 'నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంతమాత్రాన నన్ను అన్ లక్కీ అంటూ సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు వినీ వినీ నాకు బాధగా ఉంది. విసుగొచ్చింది.



నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడి పెడుతున్నారు? నాతో ఉన్న వాటితో నేను సంతోషంగానే ఉన్నా. లేని వాటి గురించి బాధ లేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. మనం 2024 లో ఉన్నాం. ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకుల వల్ల విడిపోయిన, లేదా చనిపోయిన భాగస్వామితో ముడి పెట్టడం ఇకనైనా ఆపండి. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి మాత్రమే గుర్తింపు ఇవ్వండి.' అంటూ రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు.

First Published:  21 Jun 2024 7:41 PM IST
Next Story