Kalyan Ram's Enno Ratrulosthayi Song: రీమిక్స్ సాంగ్ అదిరింది
Kalyan Ram's Enno Ratrulosthayi Video Song: కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా అమిగోస్. ఈ సినిమాలో ఓ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేశారు.

డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పటికే సినిమా ప్రచారం భారీఎత్తున జరుగుతోంది. మూవీ టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మక్షేత్రం సినిమాలో ఎవర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్.
ధర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాటను దివంగత ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాటకు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయన తనయుడు ఎస్.పి.బి.చరణ్ ఆలపించారు. ఈ క్లాసిక్ సాంగ్‌ను ఎస్.పి.బి.చరణ్‌తో పాటు సమీర భరద్వాజ్ ఆలపించారు. ఈ రీమిక్స్ సాంగ్ మరోసారి మనల్ని ఇళయరాజా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
ఈ వీడియో సాంగ్ కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ మధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చక్కగా ఎలివేట్ చేసింది. పాటకు తగ్గట్టు మంచి సెట్స్ వేశారు. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ మెలోడి సాంగ్ లో మరింత అందంగా కనిపిస్తుంటే.. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు.
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.