Telugu Global
Cinema & Entertainment

Naga Chaitanya | తండేల్ క్రిస్మస్ కు వస్తుందా?

NagaChaitanya's Thandel - నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా తండేల్. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా?

Naga Chaitanya | తండేల్ క్రిస్మస్ కు వస్తుందా?
X

బాక్సాఫీస్ హిట్ కోసం నాగ చైతన్య చాలా కష్టపడుతున్నాడు. అతని చివరి రెండు చిత్రాలు కస్టడీ, థాంక్యూ ఫెయిల్ అయ్యాయి. దీనికితోడు అమీర్ ఖాన్ తో చేసిన లాల్ సింగ్ చద్దా మరో దెబ్బ. దీంతో ఈ నటుడు తన ఆశలన్నీ చందు మొండేటి తీస్తున్న 'తండేల్' పైనే పెట్టుకున్నాడు.

అయితే ఇప్పుడీ సినిమాకు కూడా ఇబ్బంది ఎదురైంది. డిసెంబర్ లో తండేల్ రిలీజ్ పెట్టుకున్నారు. కట్ చేస్తే, పుష్ప-2కు డిసెంబర్ 6కు వచ్చి చేరింది. దీంతో ఇతర సినిమాలు అటుఇటు ఎడ్జెస్ట్ అవ్వబోతున్నాయి. ఈ క్రమంలో తండేల్ సినిమా క్రిస్మస్ కు వస్తుందా రాదా అనే అనుమానాలున్నాయి.

ఈ చిత్రంలో మత్స్యకారుడిగాగా కనిపిస్తాడు నాగచైతన్య. అతడు శ్రీకాకుళం యాసలో మాట్లాడతాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో, అతడు తండేల్ గురించి మాట్లాడాడు. తన కెరీర్ లో అతిపెద్ద చిత్రంగా అవతరించిందని చెప్పుకొచ్చాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ఉత్తరాంధ్రలోని కొన్ని లొకేషన్లలో ముగిసింది. ప్రస్తుతం నాగచైతన్య తన తల్లి దగ్గరకు చెన్నై వెళ్లాడు. తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో మరో 2 షెడ్యూల్స్ ఉంటాయి. దీంతో టోటల్ సినిమా పూర్తవుతుంది.




First Published:  21 Jun 2024 12:01 PM GMT
Next Story