Reba Monica John | పవన్ కల్యాణ్ సినిమా మిస్సయింది
Reba Monica John - సామజవరగమన సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది రెబా మోనికా జాన్. అయితే అంతకంటే ముందు ఈమె బ్రో సినిమాలో అవకాశం కోల్పోయింది.

స్టార్ హీరో సరసన నటిస్తే వచ్చే క్రేజ్ వేరు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ లాంటి హీరో సరసన నటిస్తే ఓవర్ నైట్ స్టార్ డమ్ గ్యారెంటీ. మరి అలాంటి అవకాశం మిస్ అయితే ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది హీరోయిన్ రెబా మోనికా జాన్.
"బ్రో సినిమాకు నేను లుక్ టెస్ట్ ఇచ్చాను. కానీ ఆ సినిమాకు సెలక్ట్ అవ్వలేకపోయాను. అదే టైమ్ లో వేరే ఫ్రెండ్ ద్వారా నిర్మాత రాజేష్ దండాను కలిశాను. అక్కడ కూడా లుక్ టెస్ట్ ఇచ్చాను. ఈసారి మాత్రం సెలక్ట్ అయ్యాను. అలా సామజవరగమన సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బ్రో సినిమాలో అవకాశం మిస్సయినా, సామజవరగమనా వంటి మంచి సినిమాలో చేసినందుకు హ్యాపీ గా ఉంది."
బ్రో సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర కోసం ముందుగా రెబా మోనికా జాన్ ను అనుకున్నారు. కానీ ఆమె ఎంపిక కాలేదు. మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని అంటోంది రెబా మోనికా.
"నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయిన తర్వాత కొన్ని యాడ్స్ లో నటించాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. ఫారెన్సిక్ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. తెలుగులో థియేటర్స్ లో రిలీజ్ అయిన నా మొదటి చిత్రం సామజవరగమన".
భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేస్తానంటున్న రెబా.. పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.