రంగరంగ వైభవంగా టైటిల్ అందుకే పెట్టాం
రంగరంగ వైభవంగా అనే టైటిల్ ఎందుకు పెట్టారు.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా టైటిల్ వెనక గమ్మత్తైన విషయాన్ని దర్శకుడు బయటపెట్టాడు.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రంగరంగ వైభవంగా. ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారు? సినిమా కథ చూస్తే హీరోహీరోయిన్ల మధ్య ఇగోలు, రెండు కుటుంబాల మధ్య జరిగే కథగా కనిపిస్తోంది. మరి ఈ కథకు టైటిల్ కు సంబంధం ఏంటి? దీనిపై దర్శకుడు గిరీశాయ స్పందించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న గిరీశాయ.. టైటిల్ వెనక స్టోరీని బయటపెట్టాడు.
"రంగ రంగ వైభవంగా ట్రైలర్ చూస్తున్న వారిలో ఓ ఎనర్జీని నేను గమనించాను. రేపు సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే ఎనర్జీ ఉంటుంది. చాలా మంది 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారని అడిగారు. ఇగోస్ లేని ఏ రిలేషన్‌షిప్ అయినా 'రంగ రంగ వైభవంగా'గా ఉంటుందని చెప్పటమే మా సినిమా కాన్సెప్ట్. కాబట్టే ఆ టైటిల్‌ను పెట్టాం. అమ్మాయి- అబ్బాయి, ఇద్దరు స్నేహితులు, రెండు కుటుంబాల మధ్యన ఆ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. సెప్టెంబర్ 2న థియేటర్స్‌లోకి వస్తున్నాం. టైటిల్‌కు తగ్గ సక్సెస్‌ను ప్రేక్షకులు అందిస్తారని భావిస్తున్నాం."
ఇలా టైటిల్ వెనక కాన్సెప్ట్ ను బయటపెట్టాడు దర్శకుడు. ఈ కథను ఐదేళ్ల కిందటే రాసుకున్నాడట దర్శకుడు. సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రలే హైలెట్ అవుతాయని, కథ మొత్తం వాళ్ల చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నాడు.
దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. పాటలు హిట్టవ్వడం తమకు బాగా ప్లస్ అయిందని, ఇప్పుడు ట్రయిలర్ సక్సెస్ అవ్వడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగిందని చెబుతున్నాడు. సెప్టెంబర్ 2న థియేటర్లలోకి వస్తోంది రంగరంగ వైభవంగా సినిమా.