Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | పాటలతో సందడి చేయనున్న బచ్చన్

Mr Bachchan - రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా పాటలతో సందడి చేయబోతోంది.

Mr Bachchan | పాటలతో సందడి చేయనున్న బచ్చన్
X

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన షో-రీల్ వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మేకర్స్ ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ జులై 8న రిలీజ్ కానుంది. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేశాడట.

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా హిట్స్ గా ఆలరించాయి. 'మిరపకాయ్' ఆడియో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 'మిస్టర్ బచ్చన్' ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. ఫస్ట్ సింగిల్ తో ఈ విషయంపై తేలిపోతుంది.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అయనంక బోస్ డీవోపీగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

First Published:  6 July 2024 5:31 PM GMT
Next Story