Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan Show reel | రవితేజ కొత్త సినిమా షోరీల్ రిలీజ్

Raviteja's Mr Bachchan - రవితేజ-హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా షో-రీల్ రిలీజ్ అయింది.

Mr Bachchan Show reel | రవితేజ కొత్త సినిమా షోరీల్ రిలీజ్
X

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ బచ్చన్' కోసం కలిశారు. షోరీల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

ఈ షోరీల్‌ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. షోరీల్ ని కంప్లీట్ యంగేజింగ్ గా కట్ చేశారు హరీష్ శంకర్. రవితేజ స్టైలిష్, మాస్ క్యారెక్టర్‌లో పరిచయం కాగా, జగపతి బాబు విలన్ గా కనిపించాడు. రవితేజ గెటప్ క్లాస్‌గా ఉంది, అతని యాక్షన్ ఎక్కువగా మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. రవితేజ అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్ చేసే చివరి సీన్ బాగుంది.

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరూ షోరీల్‌లో కనిపించారు. టెక్నికల్ గా.. అయనంక బోస్ అందించిన ఎక్స్ ట్రార్డినరీ కెమెరా వర్క్, మిక్కీ జె మేయర్ అందించిన స్కోర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. షోరీల్ సినిమాపై అంచ‌నాల‌ను మరింతగా పెంచింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు

First Published:  17 Jun 2024 10:27 PM IST
Next Story