Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | కాశ్మీరు లోయలో రవితేజ

Raviteja's Mr Bachchan - మిస్టర్ బచ్చన్ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తయింది. షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

Mr Bachchan | కాశ్మీరు లోయలో రవితేజ
X

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ "మిస్టర్ బచ్చన్". ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సుందరమైన కాశ్మీరు లోయలో జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని ముగింపు దశకు చేరుకుంది.

తాజా షెడ్యూల్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ పై బ్యూటీఫుల్ మెలోడీ డ్యూయెట్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లోకేషన్ లో ఈ పాట చిత్రీకరణ 4 రోజులుగా నడుస్తోంది. ఈ సాంగ్ షూట్ చివరి రోజు.

90 శాతం చిత్రీకరణ పూర్తి కావడంతో, మిగిలిన భాగాన్ని చిత్రీకరించే దిశగా టీమ్ శరవేగంగా పని చేస్తోంది. రవితేజ, హరీష్ శంకర్, అద్భుతమైన ప్రొడక్షన్ టీం సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న "మిస్టర్ బచ్చన్" కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే షో రీల్ రిలీజ్ చేశారు. సినిమా ఆద్యంతం యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని, షోరీల్ తో స్పష్టమైంది. బాలీవుడ్ హిట్ సినిమాకు రీమేక్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ కు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 Jun 2024 9:29 PM IST
Next Story