Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్స్

Mr Bachchan - రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Mr Bachchan | మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్స్
X

మాస్ రాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా లక్నో లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తోంది. సినిమాలో ఈ యాక్షన్ బ్లాక్స్ హైలెట్ అంటున్నారు. రవితేజ, హరీష్ శంకర్ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'నామ్ తో సునా హోగా' ట్యాగ్‌లైన్ రూపొందుతున్న 'మిస్టర్ బచ్చన్' లో రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు హరీష్ శంకర్.

ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమౌతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్. పవన్ కల్యాణ్ ఫ్రీ అయ్యేలోగా ఈ సినిమాను పూర్తిచేయాలనేది హరీశ్ శంకర్ టార్గెట్. పవన్ ఫ్రీ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ మొదలవుతుంది.

First Published:  28 March 2024 7:31 AM IST
Next Story