Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan Trailer Review | మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్

Mr Bachchan Trailer Review: రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వస్తోంది మిస్టర్ బచ్చన్. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ అయింది.

Mr Bachchan Trailer Review
X

Mr Bachchan Trailer Review

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో 'మిస్టర్ బచ్చన్‌'తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, టీజర్‌తో పాటు పాటలు క్లిక్ అయ్యాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

రవితేజ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. "సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే.."అనే డైలాగ్ సినిమా స్టోరీలైన్ ను చెప్పకనే చెప్పింది.

బచ్చన్ తన ఊర్లో జిక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ట్రైలర్‌లోని రెప్పల్ డప్పుల్ అనే హై-ఎనర్జీ నంబర్‌ ఒక హైలెట్ గా నిలిచింది. పవర్ ఫుల్ వ్యక్తికి వ్యతిరేకంగా ఐటీ దాడులకు నాయకత్వం వహించడానికి హీరో యాక్షన్ లోకి దిగడంతో ట్రైలర్ లో ట్విస్ట్ పెట్టారు.

టైటిల్ రోల్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ బాగున్నాయి. జగపతి బాబు పవర్ ఫుల్ విలన్ రోల్ పోషించాడు. భాగ్యశ్రీ బోర్స్ తన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ బాగుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు.



First Published:  7 Aug 2024 10:22 PM IST
Next Story