Dhamaka Trailer: ధమాకా ట్రయిలర్ రివ్యూ
Dhamaka Movie Trailer Review: రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని ఇంకాస్త పెంచే విధంగా ట్రయిలర్ కట్ చేశారు.

Dhamaka Movie Trailer Review
రవితేజ, త్రినాధ రావు నక్కిన కాంబోలో వస్తోంది 'ధమాకా'. డబుల్ ఇంపాక్ట్ అనేది ట్యాగ్ లైన్. టిజి విశ్వప్రసాద్ నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు.
స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో 1000 మందికి ఉపాధిని ఇవ్వగలడు. మరోవైపు పావని (శ్రీలీల) వారిద్దరితో ప్రేమలో ఉంటుంది. స్వామి, ఆనంద్‌లు దారులు వేరు. కానీ విధి వారిని ఒక కామన్ శత్రువుతో పోరాడటానికి ఒక చోట చేరుస్తుంది.
ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్రయిలర్ లో కథను క్లియర్ గా చెప్పేశారు. రవితేజ ఆనంద్‌గా క్లాస్‌గా కనిపించి స్వామిగా మాస్‌గా కనిపించాడు. రెండు పాత్రల్లోనూ బాగున్నాడు. శ్రీలీల తన ఛార్మ్ నెస్ తో ఆకట్టుకుంది. శ్రీలీలా, రవితేజ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అలరిస్తోంది.
భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా జింతాక్ బీట్ బాగున్నాయి. ట్రయిలర్ లో కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ట్రైలర్ లో ప్రసన్న కుమార్ బెజవాడ హిలేరియస్ రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. త్రివిక్రమ్‌పై ఒక డైలాగ్ హిలేరియస్ గా ఉంది.
డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది ధమాకా.