Dhamaka Box Office: మొదటి రోజు వసూళ్లు
Dhamaka Movie Box Office Collections: రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గా రవితేజ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ ఓపెనర్.

Dhamaka Box Office: మొదటి రోజు వసూళ్లు
రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే, రీసెంట్ గా రవితేజ నటించిన సినిమాల్లో ఖిలాడీ తర్వాత బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ధమాకా. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 66 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో విడుదలైన మొదటి రోజే 2 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది ధమాకా సినిమా.
వరల్డ్ వైడ్ ఈ సినిమాను 18 కోట్ల రూపాయలకు (హయ్యర్స్ తో కలిపి) అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 19 కోట్ల రూపాయలు రావాలి. మొదటి రోజు వసూళ్లను మినహాయిస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 13 కోట్లకు పైగా వసూళ్లు రావాలి.
ధమాకాకు డీసెంట్ టాక్ వచ్చింది. కాకపోతే హిట్ టాక్ మాత్రం రాలేదు. సో.. ఈ సినిమా ఏ స్థాయిలో నిలబడుతుందనేది చూడాలి. సినిమా క్లిక్ అయితే మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.