Mahaveerudu - మహావీరుడు కోసం మాస్ మహారాజా
Raviteja voice over for Mahaveerudu - శివకార్తికేయన్ హీరోగా తెలుగు-తమిళ భాషల్లో వస్తోంది మహావీరుడు సినిమా. ఈ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

Mahaveerudu Movie: మహావీరుడు ఆగస్ట్ లో వస్తున్నాడు
శివకార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మహావీరుడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ. డైరక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు.
ఈ చిత్రానికి మాస్ రాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. శివకార్తికేయన్ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అతను ఏదో ఒక ప్రత్యేక శక్తి నుంచి గైడెన్స్ కోరుతున్నట్లుగా ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు ఓ పవర్ లో “ధైర్యమే జయం” అంటూ రవితేజ వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా ఉంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
''రవితేజ సార్ మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్ అందించడం చాలా ఆనందంగా ఉంది. మహావీరుడు టీమ్‌కి మీరు అందించిన సపోర్ట్‌కి చాలా కృతజ్ఞతలు సార్. జూలై 14 నుండి మహావీరుడు. ధైర్యమే జయం" అని శివకార్తికేయన్ ట్వీట్ చేశాడు.
ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.
. @RaviTeja_offl Sir It’s a great pleasure to have your energetic voice in our film and thank you so much for your support to the #Mahaveerudu team sir
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 11, 2023
- Sivakarthikeyan #MahaveeruduFromJuly14th #DhairiyameJeyam pic.twitter.com/682YdgVe7B