Telugu Global
Cinema & Entertainment

Raviteja | మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్న మాస్ రాజా

Raviteja - టాలీవుడ్ కు మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాడు రవితేజ. ఆమె పేరు భాగ్యశ్రీ.

Raviteja | మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్న మాస్ రాజా
X

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పుడీ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.

ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా ఉందిది. చీరలో క్లాసీగా, అందంగా కనిపిస్తోంది.

హరీష్ శంకర్ హీరోయిన్స్ ని అద్భుతంగా చూపిస్తారు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతుంది. రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ లోనూ చాలా ఆసక్తి ఉంది.

హీరోయిన్లను పరిచయం చేయడం రవితేజకు కొత్తకాదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లను పరిచయం చేశాడు. లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కూడా కొత్త హీరోయిన్లే నటించారు. ఇప్పుడు భాగ్యశ్రీ కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.

First Published:  16 Dec 2023 9:10 PM IST
Next Story