Tiger Nageswarrao | టైగర్ నాగేశ్వరరావుపై రవితేజ రియాక్షన్
Tiger Nageswarrao - టైగర్ నాగేశ్వరరావు సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు రవితేజ. ఈ సినిమాపై వస్తున్న విమర్శలపై మాత్రం స్పందించలేదు.
దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది టైగర్ నాగేశ్వరరావు సినిమా. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ బయోపిక్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 3 గంటల రన్ టైమ్ లో సినిమా రావడంతో, ప్రేక్షకులు భరించలేకపోయారు. దీంతో వెంటనే మేకర్స్ కత్తెరకు పనిచెప్పారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి ఏకంగా 30 నిమిషాల సన్నివేశాల్ని కట్ చేశారు. అలా 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లలో నడుస్తోంది ఈ సినిమా. అయినప్పటికీ శనివారం ఈ సినిమాకు రెస్పాన్స్ పెద్దగా రాలేదు. ఈ క్రమంలో మేకర్స్, సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు. స్వయంగా రవితేజ ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా పెద్ద హిట్టయిందంటున్నాడు రవితేజ. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు వంశీకే దక్కుతుందని తెలిపాడు. వంశీ లాంటి క్లారిటీ ఉన్న దర్శకులతో పనిచేయడం తనకు ఇష్టమని, రాబోయే రోజుల్లో వంశీతో మరో సినిమా చేస్తానని రవితేజ ప్రకటించడం విశేషం.
స్టువర్టుపురంకు చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా.. ఆ ప్రాంతంలో చెప్పుకునే పుకార్లను బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వంశీ. మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, కమర్షియల్ సినిమాకు తగ్గ సెటప్ మాత్రం పెట్టుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ ఫ్లాట్ గా రన్ అవ్వడం, సాగదీసినట్టు అనిపించడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది.