Ravi Teja, sharwanand Multistarrer: మరో మల్టీస్టారర్ లో మాస్ రాజా
Ravi Teja, sharwanand Multistarrer Movie: అన్నీ అనుకున్నట్లు జరిగితే రవితేజ, శర్వానంద్ కాంబో లో ఒక మల్టీ స్టారర్ వస్తుంది.

Ravi Teja, sharwanand Multistarrer: మరో మల్టీస్టారర్ లో మాస్ రాజా
రవితేజకు మల్టీస్టారర్లు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ లో చేశాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మాస్ రాజా. ఇప్పుడు మరో మల్టీస్టారర్ లో నటించబోతున్నాడు ఈ సీనిర్ హీరో.
కలర్ ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడు. ఆ కథను రవితేజకు వినిపించాడు. రవితేజకు క్యారెక్టర్ బాగా నచ్చింది. నటించడానికి ఒప్పుకున్నాడట. ఇక ఈ కథలో రెండో హీరో ఎవరంటే, శర్వానంద్.
శర్వానంద్ కు కూడా మల్టీస్టారర్లు కొత్తకాదు. రీసెంట్ గా సిద్దార్థ్ తో సినిమా చేశాడు. అంతకుముందు కూడా మోహన్ బాబు, అల్లరినరేష్ లాంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. శర్వానంద్ కు కూడా ఈ కథ నచ్చితే, ప్రాజెక్ట్ సెట్ అయినట్టే.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. హీరోలు ఓకే అన్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. అన్నట్టు రవితేజ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళం రీమేక్ సబ్జెక్టు కూడా ఉంది. ఇది కూడా మల్టీస్టారరే. ఈ ప్రాజెక్టుకు ఇంకా అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.