Telugu Global
Cinema & Entertainment

Raviteja Harish Shankar | ఈ ఇద్దరూ మళ్లీ కలిశారు

Raviteja Harish Shankar - రవితేజ, హరీశ్ మళ్లీ కలిశారు. మరో మాస్ మూవీకి రంగం సిద్ధం చేశారు.

Raviteja Harish Shankar | ఈ ఇద్దరూ మళ్లీ కలిశారు
X

రవితేజ, హరీష్ శంకర్ మరోసారి కలిశారు. ఈ సారి వాళ్లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ చేతులు కలిపింది. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది హరీష్. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మాస్, క్రేజీ కాంబినేషన్‌ పై అంచనాలు పెరిగాయి.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ తన హీరోలను మాస్ అవతార్ లో చూపించడంలో దిట్ట. రవితేజతో హరీష్ చేసిన గత చిత్రం ’మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రేక్షకులు చాన్నాళ్లుగా వెయిటింగ్. ఇన్నాళ్లకు అది సాకారమైంది.

‘ఈసారి మాస్ రీ-యూనియన్ స్పైసీగా ఉంటుంది’ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. రవితేజపై ఫొటోషూట్ తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  14 Dec 2023 7:25 AM IST
Next Story