Telugu Global
Cinema & Entertainment

Raviteja | మిస్టర్ బచ్చన్ గా మారిన మాస్ రాజా

Raviteja - రవితేజ బిగ్ బి అభిమాని అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి కొత్త సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ పెట్టారు.

Raviteja | మిస్టర్ బచ్చన్ గా మారిన మాస్ రాజా
X

మాస్ మహారాజా రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. తన కొన్ని సినిమాలలో బిగ్ బిని అనుకరిస్తూ అలరించారు. అసలు విషయానికి వస్తే.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో రవితేజ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ రవితేజ అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్‌ను అనుకరిస్తున్నట్లు అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

రవితేజ పాత స్కూటర్‌పై స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు. అతను సినిమా లవరా? సినిమాలో అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానా? 'బిగ్ బి-నామ్ తో సునా హోగా' అనే పాపులర్ డైలాగ్ ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ పోస్టర్ మాస్, అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది.

ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి-సిరీస్ సహ-నిర్మాత.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వస్తుంది.




First Published:  18 Dec 2023 8:56 PM IST
Next Story