Telugu Global
Cinema & Entertainment

Ravi Teja, Sreeleela | మళ్లీ కలిసిన హిట్ జోడీ

Raviteja and Sreeleela - ధమాకా తర్వాత మరోసారి రవితేజ, శ్రీలీల చేతులు కలిపారు. కొత్త సినిమా చేయబోతున్నారు.

Ravi Teja, Sreeleela | మళ్లీ కలిసిన హిట్ జోడీ
X

రవితేజ కెరీర్‌లో లాస్ట్ హిట్ ధమాకా. వంద కోట్ల సినిమా అది. ఈ ప్రాజెక్ట్ తర్వాత, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు చేశాడు రవితేజ. ఇవన్నీ వేటికవే డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు తన 75వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు రవితేజ. మైల్ స్టోన్ మూవీ కాబట్టి కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ధమాకా హీరోయిన్ శ్రీ లీలను రిపీట్ చేస్తున్నాడు.

ధమాకా సినిమా శ్రీలీల కెరీర్ కు టర్నింగ్ పాయింట్. సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే శ్రీలీల కూడా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేదు. చివరికి మహేష్ బాబు కూడా హిట్ కొట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు రవితేజ 75వ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకరా స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది. ధమాకా చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ ఈ ప్రాజెక్ట్‌కి కూడా స్వరాలు సమకూరుస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తాడు. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

First Published:  27 May 2024 5:26 PM GMT
Next Story