Telugu Global
Cinema & Entertainment

Raveena Tandon | రూ.100 కోట్లు పరువు నష్టం

Raveena Tandon - తనపై తప్పుడు వీడియో ప్రచురించిన ఓ జర్నలిస్టుపై రవీనా టాండన్ ఫైర్ అయింది. అతడిపై ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసింది.

Raveena Tandon | రూ.100 కోట్లు పరువు నష్టం
X

సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఈమధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమె నివాసానికి సమీపంలో కొంతమంది వ్యక్తులు రవీనా టాండన్ కారును, ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది రవీనా.

జర్నలిస్టుగా చెప్పుకునే ఓ వ్యక్తి, తన సోషల్ మీడియా ఎకౌంట్ లో రవీనా టాండన్ కు సంబంధించి నకిలీ వీడియోను పోస్ట్ చేశాడంట. అది నిజమైన వీడియో కాదని, తన ప్రతిష్టను కించపరిచేలా ఉందంటూ అతడిపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసి, నోటీసులు పంపించింది రవీనా.

జూన్ 1న జరిగిన ఆ వివాదానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే సీసీటీవీ ఫూటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. రవీనా తప్పులేదని ప్రకటిస్తూనే, ఆ టైమ్ లో రవీనా మద్యం సేవించలేదని కూడా నిర్ధారించారు. అయినప్పటికీ సదరు జర్నలిస్ట్ తప్పుగా వీడియోను పోస్టు చేయడంతో రవీనా ఇలా నోటీసులు పంపించింది.

49 ఏళ్ల రవీనా టాండన్, ప్రస్తుతం బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. కేజీఎఫ్-2లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా సక్సెస్ తో రవీనాకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

First Published:  19 Jun 2024 8:12 AM IST
Next Story